ఎన్టీఆర్ కు జోడిగా నేషనల్ క్రష్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాహ్ణవి కపూర్ ఎన్టీఆర్ తో జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విల్లన్ గా నటించనున్నారు. ఇటీవలే ఈ సినిమా నుండి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల అయినా ఫియర్ సాంగ్ ఇప్పటికే 50+ మిలియన్ వ్యూస్ సాధించింది. రానున్న దసరా కు ఈ సినిమా విడుదల జరిగేలా మేకర్స్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో మరో సినిమా అప్డేట్ కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడం జరిగిది. ఆ సినిమాకు డ్రాగన్ అనే పేరు పెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న రష్మిక కు ఈ సినిమా తో ఎన్టీఆర్ తో నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది అనే చెప్పుకోవాలి.