వెంకటేష్, రుణ్ తేజ్ కలిసి నటించిన కామెడీ మల్టీస్టారర్ సినిమా F2 బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే ఇద్దరి హీరోల మార్కెట్ కూడా పెరిగింది. ఇక అంతకుముందు కొన్ని ఫెయిల్యూర్స్ తో హీరోయిన్స్ కి కూడా ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. మొత్తానికి ఇక ఆ సినిమా సీక్వెల్ ని తెరకెక్కించాలని దర్శకుడు అనిల్ రావిపూడి లాక్ డౌన్ లోనే కథను రెడీ చేశాడు.
ఇప్పటికే నిర్మాత దిల్ రాజుకి కూడా ఫుల్ స్క్రిప్ట్ ని వినిపించగా సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. హీరోలు షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నెలలోనే స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితులు భయంకరంగా ఉండడంతో నవంబర్ లో స్టార్ట్ చేయాలని ఇక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సారి దర్శకుడు అనిల్ మరో స్టార్ హీరోను కూడా సెలెక్ట్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ముగ్గురు హీరోలు సరికొత్త కామెడీతో అలరించనున్నట్లు సమాచారం.