తెలుగు ‘దర్శకుడి’తో కన్నడ యువ ‘హీరో’ న్యూ ప్రాజెక్ట్!!

టాలీవుడ్ దర్శకుడు విజయ్ కుమార్ కొండా నెక్స్ట్ నిఖిల్ కుమారస్వామితో వర్క్ చేయబోతున్నాడు. ఇక ఈ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ సెప్టెంబర్ 11 న ప్రేక్షకుల ముందుకి తేనున్నారు. తెలుగులో కూడా నిర్మించబడుతున్న ఈ చిత్రాన్ని లాహరి మ్యూజిక్ నిర్మిస్తోంది.

ప్రస్తుతం ఎన్‌కె 4 అని పిలవబడే ఈ చిత్రంలో ప్రేమ, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ వంటి అంశాలు ఉంటాయట. నిఖిల్ అక్టోబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ ఏడాది ఆరంభంలోనే వివాహం చేసుకున్న నిఖిల్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించబోయే రొమాంటిక్ లవ్ స్టోరీలో కూడా హీరోగా నటిస్తున్నాడు. నిఖిల్ చివరిసారిగా కురుక్షేత్ర అనే పౌరాణిక చిత్రంలో అభిమన్యుగాడిగా వెండితెరపై కనిపించాడు. లాక్ డౌన్ నుంచి కూడా నిఖిల్ తన తండ్రి హెచ్ డి కుమార్స్వామి మరియు తల్లి అనిత నియోజకవర్గాలను రెగ్యులర్ గా సందర్శిస్తున్నాడు.