‘టాలీవుడ్’ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన మరో ‘తమిళ్ హీరో’!!

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటీనటులకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. సినిమా కంటెంట్ నచ్చితే వాళ్లకు కూడా ఇక్కడ ఒక స్పెషల్ మార్కెట్ సెట్టవుతోంది. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, కార్తీ, విశాల్, విజయ్ వంటి స్టార్స్ టాలీవుడ్ పై ఏ స్థాయిలో పట్టు సాధిస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక అదే బాటలో శివ కార్తికేయన్ కూడా టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. మిమిక్రి ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తరువాత బుల్లితెరపై కూడా కొన్నాళ్ళు అలరించిన శివ ఆ తరువాత హీరోగా క్లిక్కయ్యాడు. కష్టపడే గుణం ఎక్కువగా అలవాటు చేసుకున్న ఈ టాలెంటేడ్ హీరో త్వరలో డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నటుడు పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత మెల్లగా ఒక డైరెక్ట్ తెలుగు సినిమాపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.