కుమారి ఆంటీ కి పోటీగా యాంకర్ సుమ ఏం చేసారో తెలుసా?

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో కుమారి ఆంటీ ఒకరు. మదాపూర్ లో ఫుడ్ స్టాల్ నడిపించే ఆమె రుచి కరమైన వంటలతో పాటుగా తనదైన స్టైల్ లో మాట్లాడుతూ వచ్చిన కస్టమర్స్ ని ఆకర్షిస్తుంది. ఇక మీది 1000 కాబట్టి రెండు లవర్లు ఎక్స్ ట్రా అన్న మాట చాలా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో సూపర్ పాపులర్ అయిన కుమారీ ఆంటీ గురించి సెలబ్రిటీస్ కూడా చర్చించుకుంటున్నారు.

యాంకర్ సుమ కుమారి ఆంటీ లా ట్రై చేసి ఒక వీడియో చేసింది. ముఖ్యంగా కుమారి ఆంటీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ సాంగ్ కి సుమ కూడా కుమారి ఆంటీలా మారి ఒక స్పెషల్ వీడియో చేసింది. సుమ తన సోషల్ మీడియాలో మీది మొత్తం 1000 రెండు లివర్లు ఎక్స్ ట్రా అంటూ ఈ వీడియో షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఎవరు పాపులర్ ట్రెండింగ్ లోకి వచ్చినా వారిని మరింత లేపడం మన వాళ్లకు అలవాటే. ఇప్పటికే స్టార్ మా కుమారి ఆంటీని ఒక షోలో కనిపించేలా చేస్తున్నారని తెలుస్తుండగా లేటెస్ట్ గా సుమ కూడా కుమారి ఆంటీ సాంగ్ తో వీడియో చేసి సర్ ప్రైజ్ చేసింది.

సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె విషయంలో స్పందించి ఆమెను కలుస్తానని చెప్పడంతో అప్పటి నుంచి కుమారి ఆంటీ పేరు మారుమోగింది. ఈ పాపులారిటీ ద్వారా కుమారి ఆంటీ బిజినెస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా యాంకర్ సుమ కుమారి ఆంటీలా మారి చేసిన వీడియో మాత్రం ఆడియన్స్ ని అలరిస్తుంది. స్టార్ యాంకర్ కూడా ఇప్పుడు కుమారి ఆంటీలా మారి చేసిన ఈ క్రేజీ వీడియో కుమారి ఆంటీ పాపులారిటీని మరింత పెంచేస్తుంది. అయితే వీరంతా కూడా ఆమెకు ప్లస్ అవ్వాలనే చేస్తున్నారు కానీ కొన్ని సందర్భాల్లో అది ఆమెకు మైనస్ అవుతుందని గుర్తించలేకపోతున్నారు.

https://www.instagram.com/reel/C3FlXhOpENO/?utm_source=ig_web_copy_link