Anchor Pradeep: ప్రముఖ యాంకర్ ప్రదీప్ తొలిసారి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 30రోజుల్లో ప్రేమించడం ఎలా. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మున్నా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. లవ్ రొమాంటిక్‌గా సాగిన ఈ ట్రైలర్ యూత్‌కి కావల్సిన అంశాలతో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక పునర్జన్మ నేపథ్యంలో ఎమోషనల్ అంశాలు కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియో విశేష ఆదరణ దక్కించుకుంది. ప్రముఖ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడిన నీలి నీలి ఆకాశం సాంగ్ యూత్‌ని ఒక ఊపు ఊపింది. కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్‌కు ఆలస్యమైనా.. ఈ నెల 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు వచ్చినా నిర్మాతలు థియేటర్ల వైపే మొగ్గు చూపారు. ఇక ఈ చిత్రంలో Anchor Pradeep ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించగా.. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకురుస్తున్నారు.