లెస్బియన్ పాత్రలో శృతిహాసన్

రవితేజ-గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో శృతిహాసన్ పాత్రపై విమర్శలొస్తున్నాయి. ఆమె హీరోయిన్‌గా కాదని, తల్లి పాత్రలో నటించిందని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు శృతిహాసన్‌కు మంచి పేరే వస్తోంది.

sruthi hasaan as lesbian

అయితే నెట్‌ఫ్లిక్స్ తెలుగులో నిర్మిస్తున్న పిట్టక కథలు వెబ్ సిరీస్‌లో శృతిహాసన్ నటిస్తుండగా.. ఇందులో ఆమె పాత్ర లెస్బియన్ అని తెలుస్తోంది. ఇటీవలే దీని టీజర్ రిలీజై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాలుగు భాగాలుగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. లక్ష్మీ మంచు, అమలాపాల్, ఈషా రెబ్బ కూడా ఇందులో నటించారు. ఇక జగపతిబాబు, సత్యదేవ్ ఇందులో కీలక పాత్రలో నటించారు. నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాష్కర్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు.