మళ్లీ ఆ హీరోయిన్ కావాలంటున్న త్రివిక్రమ్

టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కొద్దికాలంలో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పూజాహెగ్దే. టాప్ హీరోల అందరి సరసన అవకాశాలు కొట్టేస్తోంది. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన ఇప్పటికే నటించిన ఈ భామ.. ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో సినిమాలో పూజాహెగ్దే ఛాన్స్ కొట్టేసింది.

puja hegde in ntr movie

గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల్లో పూజాహెగ్దే నటించింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ మరో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా పూజాహెగ్దేను తీసుకున్నట్లు సమాచారం. పూజాహెగ్దే అయితేనే బాగుంటుందని భావించిన త్రివిక్రమ్.. చివరికి ఆమెను హీరేయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.