చంపేస్తామంటూ స్టార్ హీరోయిన్‌కి బెదిరింపులు

వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో నటించిన దిశా పటానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో బిజీబిజీగా ఉంది. ఇటీవల బాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ నటించిన భాగీ 2, భాగీ 3 సినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న రాధే సినిమాలో నటించింది. అయితే తాజాగా ఈ భామకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. కొందరు అగంతకులు దిశా పటానీకి కాల్ చేసి బెదిరిస్తున్నారట.

disha pathani fake calls

చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారట. దీంతో దీనిపై దిశా పటానీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో పోలీసులు ట్రేస్ చేస్తున్నారట. పాకిస్తాన్ నుంచి ఈ కాల్స్ వస్తున్నట్లు పోలీసులు గుర్తించారట.