యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా యస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి ప్రదీప్ (మున్నా)ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. టెస్టుఫుల్ ప్రొడ్యూసర్ యస్వీ బాబు నిర్మించిన చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా”. జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో.. దిగ్విజయంగా రన్ అవుతుంది. ఈ సందర్బంగా ఆడియెన్స్ కి థాంక్స్ చెప్పడానికి థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఫిబ్రవరి 4న హైదరాబాద్ జే ఆర్ సి కన్విక్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో ప్రదీప్ మాచిరాజు, దర్శకుడు ఫణి ప్రదీప్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, కెమెరామెన్ శివేంద్ర, నిర్మాత యస్వీ బాబు, నటులు శుభలేఖ సుధాకర్, భద్రం, నటి హేమ, నిర్మాత తనయులు వినయ్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి సక్సెస్ సెలెబ్రేషన్స్ ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ..
‘ ఇది మా అబ్బాయి సినిమా అని.. కుటుంబ సమేతంగా థియేటర్స్ కి తరలి వచ్చి మా సినిమాని చూస్తున్న ప్రతీ ప్రేక్షకులకు నా పాదాభివందనం. రిలీజైన నాటి నుండి నేటి వరకు 25 థియేటర్స్ సందర్శించాం. ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి చాలా ఆనందం కలిగింది. సినిమా చాలా చాలా బాగుంది అని ప్రతీ ఒక్కరూ అభినందిస్తున్నారు. మేము ఊహించనంత హిట్ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. యస్వీ బాబు గారు సొంతకొడుకు సినిమాకి కేర్ తీసుకున్నంతగా నన్ను చూసుకొని హీరోగా మంచి సినిమా ద్వారా లాంచ్ చేశారు.. ఆయనకి ఎప్పుడూ ఋణపడి ఉంటాను. అలాగే నాకు జీవితాంతం గుర్తుండిపోయే సినిమా ఇచ్చిన మున్నాకి చాలా థాంక్స్.. ఒక అన్నలా భావించి నాతో ఈ సినిమా చేశాడు మున్నా. ఈ సినిమాకి నేను హీరో కాదు.. కథే హీరో. మెయిన్ లీడ్ పాత్ర చేసానంతే.. అది నచ్చబట్టే సినిమాని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. మా అందరికీ ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అలాగే లైఫ్ లాంగ్ గుర్తుండి పోయే పాటలు ఇచ్చిన మా అనూప్ కి థాంక్స్. నా మొదటి సినిమా జర్నీలో టీం అందరూ చాలా కష్టపడి చేశారు.. ఒక సక్సెస్ ఫుల్ సినిమా ఇచ్చారు నాకు. ముఖ్యంగా మా ఆర్ట్ డైరెక్టర్ నరేష్ షూటింగ్ టైంలో అనుకోకుండా మా అందరికీ దూరమయ్యారు.. ఆయన లేనిలోటు మాకు చాలా వెలిథిగా ఉంది. నా క్యారెక్టర్ ని స్కెచెస్ వేసి అద్భుతంగా డిజైన్ చేశారు. ఆయన కుటుంబానికి మేమంతా జీవితాంతం తోడు వుంటామని ప్రామిస్ చేస్తున్నాం.. ఇక నేను చేసే ప్రతీ సినిమా మొదటి సినిమాలా భావించి కష్టపడి చేస్తానని మాట ఇస్తున్నానని అన్నారు ప్రదీప్. దర్శకుడు ఫణి ప్రదీప్ (మున్నా) మాట్లాడుతూ.. ‘ మా సినిమాని ఫస్ట్ హిట్.. తర్వాత సూపర్ హిట్.. ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అని అందరూ అంటుంటుంటే చాలా హ్యాపీగా, గర్వాంగా ఉంది.. రిలీజ్ అయిన అన్ని ఏరియాలనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మా చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేసిన ఆంధ్ర, తెలంగాణ ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. హిట్ అవుతుంది అని ఫస్ట్ నుండి కాన్ఫిడెన్స్ ఉంది. అది ఇవాళ నిజం అయింది. నా మొదటి సినిమాకి నన్ను నమ్మి వర్క్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ నా థాంక్స్. కథ రాయడం చాలా ఈజీ.. కానీ స్క్రీన్ ప్లే రాయడం చాలా కష్టం.. ఈ సినిమాతో తెలిసింది. అంతలా కష్టపడి వర్క్ చేశాం. ప్రదీప్ నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా తోడుండి ఎంతో సపోర్ట్ చేశాడు. అతనికి నేను బాగా ఎడిట్ అయిపోయాను. అంతలా తనపై అభిమానం పెరిగిపోయింది. ముఖ్యంగా నన్ను నమ్మి కథపై నమ్మకంతో సినిమా చేసిన బాబు గారికి జీవితాంతం ఋణపడి ఉంటాను. ఈ సినిమా ఇంతలా రీచ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయిందంటే కారణం అనూప్. అతను నా ఏంజెల్. మనసు పెట్టి బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.. ఇక మా భద్రం నాకంటే వాడికి నాపై నమ్మకం ఎక్కువ. ప్రతీక్షణం నన్ను ఎంకరేజ్ చేస్తూ.. సపోర్ట్ చేస్తాడు.. అన్నారు.