RRR: ఎన్టీఆర్‌, చెర్రీల ఫోటోను పంచుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర‌బృందం‌!

RRR: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఓ స‌రికొత్త అప్‌డేట్‌ను పోస్ట్ చేసింది. ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీంగా, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ల్లో పోషిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్‌లో చిత్ర‌బృందం బిజీగా ఉంది.. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ చిత్రం సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని తెలియ‌జేశారు..

RRR

RRR ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆర్ఆర్ఆర్ మూవీ శ‌క్తివంత‌మైన క్లైమాక్స్ కోసం సాధ‌న త‌ర‌గ‌తులు అంటూ..‌ ఈ ఫోటోలో వీరిద్ద‌రు చిరున‌వ్వులు చిందిస్తూ ఉన్నారు. ఇటీవ‌లే ఈ చిత్రం నుంచి రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా చిత్రబృందం పోస్ట్ చేసిన పోస్ట‌ర్ ప్రేక్ష‌కులను ఎంత‌గానో అల‌రించింది. ఇక RRR ఈ చిత్రంలో తార‌క్ జోడీగా హాలీవుడ్ న‌టి ఓలీవియా మోరిస్ కాగా, చెర్రీ స‌ర‌స‌న బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రూ.400కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజ‌య్‌దేవ్‌గ‌ణ్, త‌మిళ ప్ర‌ముఖ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో పోషిస్తుండ‌గా, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం. కీర‌వాణీ ఈRRR చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని ఇటీవ‌లే చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.