గత రెండు రోజుల నుండి, తెలుగు మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్తల్లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి టాపిక్ ఒకటి. అతను పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రతి రోజు ఎదో ఒక చర్చ జరుగుతోంది. రాయలసీమ రాజకీయ నాయకుడి కుమార్తెతో ప్రదీప్ ప్రేమలో ఉన్నాడని పెద్దలతో కూడా మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ విషయంలో అసలు ట్విస్ట్ బయటపడింది.
ప్రదీప్తో సన్నిహితంగా ఉన్న వ్యక్తుల సమాచారం ప్రకారం, హీరోగా తన మొట్టమొదటి చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే విడుదల కోసం ప్రదీప్ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నాడట, ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టాలని నటుడు కోరుకుంటునట్లు తెలుస్తోంది. ఇక వివాహం గురించి ఇంకా ఏ విధంగాను ఆలోచించలేదట. కోరుకున్న అమ్మాయి రెడీగా ఉందని వస్తున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని ప్రదీప్ సన్నిహితులు చెబుతున్నారు. అలాగే రాజకీయ నేపథ్యం నుండి వచ్చిన ఏ అమ్మాయితో కూడా ప్రేమలో లేడని కూడా అంటున్నారు. మొత్తానికి ప్రదీప్ పెళ్లి రూమర్స్ మరోసారి అబద్దామని తేలిపోయింది.