డిసెంబర్‌ 18న థియేటర్లలో ‘అమ్మాయంటే అలుసా?’ విడుదల!!

కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా హీరో హీరోయిన్లుగా నవులూరి భాస్కర్ రెడ్డి సమర్పణలో గీతాశ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. నేనే శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వై. బ్రహ్మ శేఖర్, వై. లిఖితా చౌదరి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఆడియోకి మంచి స్పందన వచ్చిందని తెలుపుతూ.. ఈ చిత్రాన్ని ఈ నెల 18న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు నేనే శేఖర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను చాలా సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా వర్క్ చేశాను. ఆ అనుభవంతో నా పరిధిలో సినిమాను చాలా కష్టపడి తెరకెక్కించాం. నాకు నా టీమ్ అంతా ఎంతో సపోర్ట్ చేసింది. వారందరికీ ధన్యవాదాలు. సినిమా విషయానికి వస్తే.. ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు. వారికి గౌరవం ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాను ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఈ సినిమాలో సెకండాఫ్‌ను అలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటికే విడుదలైన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రాన్ని డిసెంబర్‌ 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాము. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. అందరూ ఈ సినిమా చూసి ఆశీర్వదిస్తారని కోరుతున్నాను..’’ అని తెలిపారు.

కార్తీక్ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా తదితరులు నటించిన ఈ చిత్రానికి
బ్యానర్: గీతాశ్రీ ఆర్ట్స్,
సంగీతం: వినీష్ గౌడ్,
సమర్పణ: ఎన్. భాస్కర్ రెడ్డి,
కో ప్రొడ్యూసర్: ఎన్. మాధవరెడ్డి,
నిర్మాతలు: వై. బ్రహ్మ శేఖర్, వై. లిఖితా చౌదరి,
కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: నేనే శేఖర్.