బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ నుంచి మెల్లగా కొలుకుంటున్నారు. 77ఏళ్ళ వయసులో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అమితాబ్ ధైర్యంగా కోవిడ్ -19ని ఎదుర్కొంటున్నారు. కొద్దిపాటి లక్షణాలు ఉన్నపుడే ఆయన వైద్యులను సంప్రదించడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఇక అమితాబ్ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారనే విషయంలో అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. వాటిలో ఎలాంటి నిజం లేదని వారి సన్నిహితులు చెబుతున్నారు. మరో వారం పాటు ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నారు. ప్రతిరోజూ ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్న వైద్యులు మరో వారం రోజుల తరువాత ఫుల్ చెకప్స్ చేస్తారట.
అమితాబ్ బచ్చన్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని అనిపించిన తరువాతే డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. మరోవైపు అభిషేక్ నానావతి హాస్పిటల్ లోనే ఉండగా.. ఐశ్వర్యారాయ్ అలాగే వారి కూతురు ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్లు సమాచారం.