అమితాబ్‌కు అప్పట్లో పెను ప్రమాదం తప్పింది

బాలీవుడ్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ ఇంకా హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే… మరోవైపు బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. హిందీలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకు అమితాబ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో భాగంగా తాను నటించిన ‘షో’లో సినిమా షూటింగ్‌లో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని అమితాబ్ బయటపెట్టారు. ‘షో’లే క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ధర్మేంద్ర చాలా టేక్‌లు తీసుకున్నాడని, అప్పుడు ఆయనకు చిరాకు వచ్చిందని చెప్పారు.

amitab bacchan

ఈ సమయంలో ఒక బాక్సులో ఉన్న బుల్లెట్లు తీసుకుని లోడ్ చేసి షూట్ చేశాడని, ఒక బుల్లెట్ తన చెవి పక్కనుంచే వెళ్లిందని అమితాబ్ తెలిపారు. తుపాకీలోని బుల్లెట్లు పేలడంతో ధర్మేంద్ర షాక్ అయ్యారని అమితాబ్ వెల్లడించారు. తాను దూరంగా ఒక కొండపై ఉన్నానని, తనకు ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారని అమితాబ్ చెప్పారు. అమితాబ్ చెప్పిన ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇటీవలే షోలో సినిమా విడుదలై 45 ఏళ్లు అయింది. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకు తాజాగా సీఆర్పీఎఫ్ డిఐజీ ప్రీత్ మోహన్ భార్య సత్వీందర్ కౌన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా షోలో సినిమాకు తన భర్త వీరాభిమాని అని ఆమె చెప్పింది. దీంతో షోలో షూటింగ్ సమయంలో జరిగిన ఈ సంఘటన అమితాబ్‌కు గుర్తొచ్చింది.