రజనీ అభిమానులకు గుడ్‌న్యూస్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి వైద్యులు మరో హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇప్పటివరకు చేసిన వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆందోళన లేదని వైద్యులు చెప్పారు. మరికొన్ని వైద్య పరీక్షలకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉందని, అవివి వచ్చిన తర్వాత రజనీకాంత్‌ను డిశ్చార్జ్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

rajanikanth

రజనీని రేపు విడుదల చేసే అవకాశముందని అపోలో వైద్యులు చెప్పారు. ప్రస్తుతం రజనీకాంత్ బీపీ అదుపులోనే ఉందన్నారు. హైబీపీ కారణంగా రజనీకాంత్‌ హాస్పిటల్‌లో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అంతేకాకుండా రజనీ ప్రస్తుతం నటిస్తున్న ‘అన్నాత్తై’ సినిమా షూటింగ్‌లో ఏడుగురికి కరోనా సోకడంతో.. రజనీ కూడా కరోనా టెస్టు చేయించుకున్నారు. పరీక్షల్లో నెగిటివ్ రావడంతో రజనీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పుడు హైబీపీ కారణంగా హాస్పిటల్‌లో రజనీ చేరడంతో అభిమానులు టెన్షన్ పడ్డారు. రేపు డిశ్చార్జ్ చేసే అవకాశముందని ఇప్పుడు వైద్యులు ప్రకటించడంతో.. అభిమానులు కాస్త ఊరట చెందారు.