14 ఏళ్ల వయస్సులోనే ఆ హీరోయిన్‌కి లైన్ వేసిన బన్నీ

తెలుగులో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్ వనితా విజయ్‌కుమార్.. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరమైంది. ఇప్పుడు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఒక తెలుగు ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ భామ తన పర్సనల్ లైఫ్, సినిమాలకు సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టింది. తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుంచి రన్ అయ్యే సమయంలో చిరంజీవి ఫ్యామిలీతో తనకు చాలా అనుబంధం ఉండేదని, చిరంజీవి ఇంట్లో ఏవైనా ఫంక్షన్లు జరిగితే తాను కూడా వెళ్లేవాడని తెలిపింది.

ALLU ARJUN

అప్పుడు అల్లు అర్జున్ వయస్సు 14 ఏళ్లు ఉండేవని, చిరు సినిమా షూటింగ్ ప్రారంభానికి వెళ్లినప్పుడు అల్లు అర్జున్ తన వైపు చూస్తూ లైన్ వేసేవాడని వనితా విజయ్ కుమార్ చెప్పింది. నాకన్నా చిన్నవాడు అయినా అలాగే చూస్తూ ఉండేవాడని చెప్పింది. బన్నీ సూపర్ డ్యాన్సర్ అని, అతడి పక్కన అవకాశం వస్తే తప్పకుండా చేస్తానంది. ఇక తాను జూనియర్ ఎన్టీఆర్‌కి పెద్ద అభిమానిని అని, ఆయన పక్కన సినిమా చేయాలని ఉందని తెలిపింది.

తెలుగులో కోడి రామకృష్ణ తెరకెక్కించిన ‘దేవి’ సినిమాలో వనితా విజయ్ కుమార్ కీలక పాత్రలలో నటించింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినా… అంతగా పేరు రాలేదు. ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకున్న ఈ సీనియర్ హీరోయిన్.. తాజాగా ఐదో వ్యక్తితో ప్రేమలో పడింది.