తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ హిట్స్ ఇస్తున్న హీరో అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం లవ్ స్టొరీ, థాంక్యు సినిమాలు చేస్తున్న చై త్వరలో బాలీవుడ్ ఇవ్వనున్నాడు. ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాలో ముందుగా విజయ్ సేతుపతి నటించాల్సి ఉండగా, డేట్స్ క్లాష్ అవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సేతుపతి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ నాగ చైతన్యకి వచ్చింది. ఈ సినిమాతో చై బాలీవుడ్ డెబ్యు ఇస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య ఓ కొత్త లుక్లో కనిపించనున్నాడట. లడఖ్ లో జరగనున్న షెడ్యూల్ లో చైతన్య లాల్ సింగ్ చద్దా టీం జాయిన్ అవ్వనున్నాడు. త్వరలో మొదలవ్వాల్సిన ఈ లడాఖ్ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. కరోనా సమయంలో రిస్క్ వద్దని అమీర్ ఖానే స్వయంగా ఈ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేసాడట. కాస్త కరోనా తగ్గిన వెంటనే తిరిగి షూటింగ్ మొదలు పెట్టే అవకశాలు ఉన్నాయి. ఈలోపు చై, విక్రమ్ కుమార్ థాంక్యు మూవీకి సంబందించిన షూటింగ్ వర్క్ చేయనున్నాడు.