ఎన్టీఆర్ ఇలా చేయడం ఇదే మొదటిసారి

నందమూరి తారక రామారావు… తెలుగు వారి ఇలవేల్పు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన అన్నగారు అంటే ఈతరం ఎన్టీఆర్ అయిన జూనియర్ కి ఎంతో ప్రేమ. తాతకి తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, రామారావు గారి జయంతికి ప్రతి ఏడాది ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళి అర్పిస్తూ ఉంటాడు. ముఖ్యంగా గత రెండేళ్లుగా ఎన్టీఆర్ ఘాట్ బాధ్యతలని ఆయనే చూసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడూ ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతని స్మరించుకోని నివాళి అర్పించే ఎన్టీఆర్ ఈ ఏడాది మాత్రం అక్కడికి వెళ్లలేక పోయాడు. ఎప్పుడూ ఎన్టీఆర్ తో పాటే ఘాట్ కి వెళ్లి నివాళి అర్పించే కళ్యాణ్ రామ్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు కానీ ఘాట్ కి వెళ్లలేక పోయాడు. ఈరోజు తాతగారి సమాధి దెగ్గరికి వెళ్లి ఆయన్ని స్మరించుకోని, నివాళి అర్పించే అన్నదమ్ములు ఇలాంటి ఒకరోజు వస్తుంది అని ఊహించి ఉండరు. ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లలేకపోయినందుకు ఈ నందమూరి లవకుశలు ఇంట్లో కూర్చోని బాధపడుతూ ఉంటారు.

కోవిడ్ పాజిటివ్ రావడం, 15 రోజులు క్వారెంటైన్ ఉండడం, బయట కూడా పరిస్థితులు బాగోలేకపోవడంతో ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లే ఆలోచనని తారక్ విరమించుకున్నాడు. అయితే ఎప్పటిలాగే, తాత ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన తారక్… పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, మా గుండెలను మరొక్కసారి తాకిపో తాత అంటూ ఎమోషనల్ అయ్యాడు. తారక్ ఘాట్ కి వెళ్లలేక పోయినా నందమూరి బాలకృష్ణ మాత్రం ఘాట్ కి వెళ్లి తండ్రికి నివాళి అర్పించాడు. ఈ సంధర్భంగా మీడియాతో మాట్లాడిన బాలయ్య, ఎన్టీఆర్ పై బుక్ రాస్తున్నానని… పాఠ్య పుస్తకాల్లో ఎన్టీఆర్ గాధని చేర్చాలని ప్రభుత్వాలకి విన్నవించారు.