గ్రాండ్ గా వస్తున్న క్రైమ్ థ్రిల్లర్… ట్రైలర్ అదిరింది

డెడికేటెడ్ తెలుగు ఓటీటీ ఆహా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కొంటూ మంచి వ్యూవర్షిప్ సొంతం చేసుకుంటుంది. ఇతర మల్టీలింగ్వల్ ఆన్లైన్ స్ట్రీమింగ్ సైట్స్ కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుంది. స్టార్ ల సినిమాలని సొంతం చేసుకుంటున్న ఆహా, ఓన్ కంటెంట్ పై కూడా కాన్సెన్ట్రేట్ చేస్తుంది. వెబ్ సిరీస్ లు చేస్తున్న ఆహా తాజాగా ప్రియదర్శితో ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ క్రైమ్ థ్రిల్లర్ చేస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ ఫిమేల్ లీడ్ గా కనిపించనున్న ఈ సిరీస్ ని త్వరలో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సంధర్భంగా మేకర్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ సిరీస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ అనేది కలర్ టింట్ నుంచే ప్రెజెంట్ చేసిన మేకర్స్, కొత్త ఫీల్ ని ఇచ్చారు. క్రిస్ప్ అండ్ క్లియర్ గా కట్ చేసిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రైలర్ లోని మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో, టాలెంటెడ్ యాక్టర్స్ కంట్రిబ్యూషన్ తో వస్తున్న ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం మాత్రం పక్కా. థియేటర్స్ బంద్ అయ్యాయి కాబట్టి సిరీస్ లు రిలీజ్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ టైం, మంచి టైం చూసుకోని రిలీజ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారు.