Ameerkhan: ఫ‌స్ట్ సినిమా రిలీజ్ కావాలి.. అప్పుడే సెల్‌ఫోన్ ఆన్ చేస్తా: అమీర్‌ఖాన్

Ameerkhan: బాలీవుడ్‌లో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేసే హీరోల్లో అమీర్‌ఖాన్ టాప్ ప్లేస్‌లో ఉంటాడ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సినిమా సినిమాకు కొత్త‌ద‌నంతో వ‌చ్చే క‌థాంశాల‌ను సినీ ప్రేక్ష‌కుల‌కు అందిస్తాడు అమీర్‌ఖాన్‌. పీకే, దంగ‌ల్ వంటి ప‌లు చిత్రాల్లో అమీర్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. ఇప్పుడీ అమీర్ న‌టిస్తున్న తాజా చిత్రం లాల్ సింగ్ చ‌ధా.. ఈ సినిమా విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు ఫోన్‌కు దూరంగా ఉండాలని క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నాడు Ameerkhan.

Ameerkhan lalsingh movie

ఫోన్ వ‌ల్ల ఏకాగ్ర‌త‌గా షూటింగ్ చేయ‌లేన‌ని మొబైల్ స్విచ్ఛాఫ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో త‌న పనికి ఆటంకం క‌లిగిస్తున్న సెల్‌ఫోన్‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని డిసైడ్ అయ్యాడు అమీర్‌. ప్ర‌స్తుతం లాల్‌సింగ్ చ‌ధా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉన్నాడు అమీర్ Ameerkhan‌. ఇక ఈ చిత్రంలో అమీర్ స‌ర‌స‌న మూడోసారి క‌రీనాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. సెటైరిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని అద్వైత్ చంద‌న్ డైరెక్ట్ చేస్తుండ‌గా.. Ameerkhan అమీర్‌ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్‌, వ‌యాకామ్ 18 మోష‌న్స్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.