భారీ రేంజ్‌లో BB3 ప్రీ రిలీజ్ బిజినెస్

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా BB3పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటినుంచే మొదలైంది. ఈ సినిమా నైజాం, వైజాగ్ ఏరియాల రైట్స్‌ను రూ.20 కోట్లకు దిల్ రాజు కోట్ చేశారని తెలుస్తోంది.

BB3 PRE RELEASE BUSSINESS

ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.60 కోట్ల వరకు అవుతుందని టాక్. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తుండగా.. ఒక పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక మరో పాత్రలో అఘోరాగా బాలయ్య కనిపించనున్నాడు.