మళ్లీ సినిమాల్లోకి అమల

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున భార్య అమల పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. అంతకుముందు హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన ఆమె.. పెళ్లి తర్వాత ఫ్యామిలీని చూసుకుంటూ సినిమాలకు దూరమైంది. అయితే లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ సినిమాలో అమ్మ పాత్రతో మళ్లీ వెండితెరపైకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఇక ఏ సినిమాలోనూ నటించలేదు.

amala

అయితే ఒక సినిమాలో అమ్మ పాత్రలో అమల నటించినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. శర్వానంద్ హీరోగా రానున్న ఒక ద్విభాష సినిమాలో అమ్మ పాత్రను పోషించిందట. తెలుగుతో పాటు తమిళంలో విడుదల అవుతున్న ఈ సినిమాకు శ్రీకార్తిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. మదర్ సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం కానుందని సమాచారం.

చాలాకాలం తర్వాత అమల మళ్లీ నటించడంతో అమ్మ పాత్రలో ఆమెను చూసేందుకు అక్కినేని అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమాలో అమ్మ పాత్రలో అమల ఎలా నటించిందో..