Pushpa: స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సుకుమార్ డైరెక్షన్ చేస్తుండగా.. ఇందులో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరంలో జరుగుతుంది. అయితే Pushpa ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలివచ్చారు.

రంపచోడవరం జంక్షన్ వద్ద బన్నీ కారుకు రౌండప్‌లో వందలాది మంది అభిమానులు మొబైల్ టార్చ్‌ను ఆన్ చేసి సందడి చేశారు. దీంతో వారికి హాయ్ చెప్పి వెళ్లాడు బన్నీ. Pushpa అయితే దీనికి సంబంధించి వీడియోను బన్నీ తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. థ్యాంక్యూ రంపచోడవరం అని పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కాగా ఇటీవలే Pushpa ఈ చిత్రాన్ని అగష్టు 13న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు చిత్రబృందం.