రవితేజ ‘ఖిలాడి’లోకి అనసూయకు వెల్‌కమ్

జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ వరుస సినిమా ఆఫర్స్ కొట్టేస్తుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమాతో హిట్‌ను అందుకున్న రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అనసూయ ఛాన్స్ కొట్టేసింది.

ANASUYA IN RAVITEJA KHILADI

ఈ విషయాన్ని తాజాగా ఖిలాడి సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘మేము స్మార్ట్‌గా ఆడతాము. ఈ లేడీ గేమ్ ఛేంజర్ కావచ్చు.. వెల్ కమ్ అనసూయ’ అని ఖిలాడి యూనిట్ ట్వీట్ చేసింది. కాగా ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్‌లో కనిపించనుండగా.. డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఇందులో కీలక పాత్రలలో నటిస్తున్నారు.