Allu Arjun: టాలీవుడ్‌లో18ఏళ్లు పూర్తి చేసుకున్న బ‌న్నీ.. ఫ్యామిలీతో హోళి వేడుక‌లు!

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి నిన్న‌టితో 18ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. మార్చి 28 2003లొ ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన గంగోత్రి సినిమాలో Allu Arjun అల్లుఅర్జున్ హీరోగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మయ్యాడు. ఈ చిత్రంతో న‌ట‌న ప‌రంగా బ‌న్నీ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు.. ఈ సినిమాలో టీనేజ్‌ లుక్‌లో క‌నిపించిన బ‌న్ని.. ఆ త‌ర్వాత సినిమా ఆర్య‌లో త‌న మేకోవ‌ర్ చూపించాడు స్టైలిష్‌స్టార్‌. బ‌న్నీ, ప‌రుగు, దేశ‌ముదురు, వేదం వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు త‌న ఖాతాలో ఉన్నాయి. బ‌న్నీ చివ‌రి చిత్రం అల వైకుంఠ‌పురం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఘ‌న విజ‌యం సాధించింది.

Alluarjun

ఇక ప్ర‌స్తుతం Allu Arjun బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప చిత్రంలో వైవిధ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇక టాలీవుడ్‌లో హీరోగా త‌న తొలి సినిమా విడుద‌లై 18ఏళ్లు గ‌డిచిన సంద‌ర్భంగా బ‌న్నీ ట్వీట్ చేశాడు.. నా తొలి సినిమా విడుద‌లై 18ఏళ్లు అవుతుంది. నా 18ఏళ్ల సినీ ప్ర‌యాణంలో తోడుగా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికీ నేను మ‌న స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు అని.. ఇన్నేళ్లుగా మీరు నా తోడుగా నిలుస్తుండ‌డం నా అదృష్టం అని ట్వీట్ చేశాడు.. ఇక ఇదిలా ఉంచితే నేడు హోళీ పండుగ సంద‌ర్భంగా Allu Arjun అల్లుఅర్జున్ త‌న ఫ్యామిలీతో హోళీ సంబ‌రాల‌ను ఘ‌నంగా జ‌రుపుకున్నాడు.. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.‌