“మిస్టర్ కిల్లర్” సినిమా టీజర్ చాలా బాగుంది… హీరో “అల్లరి నరేష్”

రమేష్ స్టూడియోస్ బ్యానర్ లో చార్లెస్ దర్శకత్వంలో నిర్మాతలు రమేష్ బాబు దూళిపాల, శ్రీ కృష్ణ శ్రవణ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “మిస్టర్ కిల్లర్”. విశ్వ, కృష కురూప్, బ్రమ్మనందం, గిరిధర్,నరేన్, ముఖ్య తారాగణం. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కి సిద్ధంగా ఉంది.

ఈ సినిమా టీజర్ ని ఇటీవలే “మహర్షి నరేష్” గా మారిన హీరో “అల్లరి నరేష్” చేతుల మీదుగా రిలీస్ చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్టిస్ట్ ఆజాద్ కూడా పాల్గొన్నారు.

నరేష్ మాట్లాడుతూ ఈ సినిమా తమిళ్ అండ్ తెలుగు భాషల్లో నిర్మించారు. మొత్తం సినిమా కాశ్మీర్ లొనే నిర్మించడం విశేషం యూనిట్ మొత్తం చాలా కష్టపడ్డారు ఈ సినిమా టీజర్ చాలా బాగుంది అలాగే మూవీ కూడా మిమ్మల్ని అలరిస్తుంది అని చెప్పారు.

ఈ సినిమా కి  కెమెరా జి .బాల మురుగన్, మ్యూజిక్ వేద్ శంకర్ సుగవణం, ఎడిటర్ ప్రవీణ్, సింగెర్స్ దామిని బట్ల, దనుంజయ్, నిర్మాతలు రమేష్ బాబు దూళిపాల మరియు శ్రీకృష్ణ శ్రవణ్ తుమ్మలపల్లి దర్శకత్వం చార్లెస్.