అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో సినిమాని ఓవర్సీస్ లో బ్ల్యూస్కై సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ బయటకి వచ్చింది. ఈ పోస్టర్ కింద లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో కానీ నెట్ఫ్లిక్స్ లో కానీ చూడలేరు అని క్లియర్ గా చెప్పేశారు. సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే, అది డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కనిపిస్తుంది. ఇవి సినిమా మార్కెట్ ని దెబ్బ తీసేవే, ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ తాకిడి మరింత పెరిగి, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయే పరిస్థితి వచ్చింది.
ఇది ఆలోచించిన చిత్ర యూనిట్ అండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అల వైకుంఠపురములో సినిమా థియేటర్లలో ఉన్నన్ని రోజులు డిజిటల్ ఫ్లాట్ఫామ్ లో అందుబాటులో లేకుండా ఉండేలా చూసుకుంటున్నారు. ఎలాగూ అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలకి ఓవర్సీస్ లో మంచి గిరాకీ ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త పడితే ఈ నిర్ణయం ద్వారా ఓవర్సీస్ లో భారీగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా నుంచి బన్నీ సినిమాకి ప్రధాన పోటీ ఎదురవనుంది.