సెన్సార్ రిపోర్ట్ వచ్చింది… ఇక సినిమా రావడమే మిగిలింది

దీవాలి రోజున బిగిల్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర టపాసుల మోతమోగించడానికి దళపతి విజయ్ రాబోతున్నాడు. ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ తో చెక్ దే ఇండియాకి ఎక్స్టెండెడ్ వెర్షన్ లాగా వస్తున్న బిగిల్ దాదాపు 220 కోట్ల బిజినెస్ చేసింది. నాన్ రజినీకాంత్ రికార్డుగా ఇది చరితకెక్కింది. రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన అట్లీ-విజయ్ కాంబో కాబట్టి అంచనాలు మరింత పెరిగాయి. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుందని సమాచారం.

bigil censor

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బిగిల్ కి యూ/ఏ సర్టిఫికెట్ లభించిందని సమాచారం. ఈ విషయమై అఫీషియల్ గా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగిల్ సినిమా తొమ్మిది సెకండ్ల తక్కువ మూడు గంటల డ్యూరేషన్ ఉండనుంది. సెన్సార్ టాక్ చూస్తే, అట్లీ విజయ్ మరోసారి హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా రాయప్పన్ క్యారెక్టర్ లో విజయ్ మూడు గంటల విజయతాండవమే చేశాడని సమాచారం. సెన్సార్ రిపోర్ట్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.