యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు ‘తండేల్’ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
‘తండేల్’ జాతర ఈవెంట్ లో హీరో అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ..అతిధులకు. ప్రేక్షకులకు,అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన సందీప్ రెడ్డి వంగా గారికి థాంక్. అరవింద్ గారు వాసు లేకుండా నెక్స్ట్ సినిమా ఎలా ఫినిష్ చెస్తాననే భయం పట్టుకుంది. వారు సినిమాలో అంతలా కాంట్రిబ్యుట్ చేస్తారు. గీత ఆర్ట్స్ పేరు నా కెరీర్ లో టాప్ లో వుంటుంది. తండేల్ నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ.తండేల్ రాజు కి నాకు రియల్ లైఫ్ లో చాలా డిఫరెన్స్ వుంటుంది. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని నమ్మిన వాసు, చందుకి థాంక్ యూ. క్యారెక్టర్ లోకి ట్రాన్స్ ఫర్మేషన్ అవ్వడానికి చాలా టైం ఇచ్చారు. చందు తో ఇది మూడో సినిమా. నన్ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తాడు. సాయి పల్లవి అద్భుతమైన నటి. తనని అందరూ ఇష్టపడతారు. తను చాలా పాజిటివ్ పర్శన్. ఈ సినిమాకి ట్రూ రాక్ స్టార్ దేవి. చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. డీవోపీ శాం గారు ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు లిరిక్ రైటర్స్ టీం అందరికీ థాంక్ యూ. శ్రీకాకులం వచ్చిన మత్సకారుల కుటుంబాలకి ధన్యవాదాలు. వారి వలనే నా క్యారెక్టర్ కి ఒక ఐడియా వచ్చింది. వారికి సముద్రం తప్పితే మరొకటి తెలీదు. వారు లేకపోతే ఈ సినిమా లేదు. వారి నుంచి చాలా నేర్చుకున్నాను. ఫిబ్రవరి 7 థియేటర్స్ లో దుల్లకొట్టేద్దాం’అన్నారు
హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన డ్యాన్స్ చేస్తూనే సాంగ్స్ కంపోజ్ చేస్తారు. అందుకే పాటల్లో అంత ఎనర్జీ వుంటుంది. ఇందులో బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. శ్యాం దత్ గారు విజువల్స్ ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. నాగేంద్ర గారు ప్రతి సెట్ కి లైఫ్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. అరవింద్ గారు నాకు తండ్రిలాంటి వారు. బన్నీవాసు గారు చాలా పాషన్ తో సినిమాని చేశారు. వారి నిర్మాణంలో వర్క్ చేయడం చాలా ఆనందంగా వుంది. సందీప్ రెడ్డి వంగా గారు ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు. ఫిలిం మేకర్ కి ఆ వాయిస్ వుండాలి. ఆయన ఈ వేడుకకు రావడం ఆనందంగా వుంది. చైతన్య గారు ఈ సినిమా కోసం చాలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆయనలో ఓ ఆకలి కనిపించింది. చాలా హార్డ్ వర్క్ చేశారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన అందరికీ థాంక్ యూ. మేము మీ సినిమానే తీశాం. చాలా మంచి సినిమా ఇది. మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ‘తండేల్’ ట్రైలర్ టీజర్ సాంగ్స్ ఏది చూసి సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ కనిపిస్తోంది. సాయి పల్లవి చైతన్య గారి కెమిస్ట్రీ చాలా రియల్ గా అనిపిస్తోంది. బన్నీ వాసు గారి ఆల్ ది వెరీ బెస్ట్. కేడీ సినిమాకి వర్క్ చేసినప్పుడు చైతన్య గారు సెట్స్ కి వచ్చేవారు. అప్పుడే ఆయన నాకు చాలా నచ్చారు. ఆయన బయట వేసుకునే కాస్ట్యుమ్స్ నా సినిమాలకి రిఫరెన్స్ గా చూపిస్తాను. దేవిశ్రీ సర్ మ్యూజిక్ కి హ్యాట్సప్. ప్రేమమ్ సినిమా నుంచి సాయి పల్లవి గారి నటన అంటే ఇష్టం. తను అప్పటికీ ఇప్పటికీ ఒకేలా వున్నారు. చందు నాకు ఆరేళ్ళుగా తెలుసు. ఈ కథ నాకు తెలుసు. అక్కినేని ఫ్యాన్స్ కి ఫీస్ట్ లా వుంటుంది. సూపర్ హిట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ వుంది. చైతన్య గారి మజిలీ సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చాను. అది పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 7 థియేటర్స్ లో దుల్లకొట్టేద్దాం.. మీరంతా రావాలి. చాలా కాన్ఫిడెన్స్ చెబుతున్నా, సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడతాను’ అన్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. చందు గారు సినిమాని అద్భుతంగా తీశారు. వాసు సినిమాని చాలా ఉన్నతంగా నిర్మించారు. చైతన్య ట్రాన్స్ఫర్ మేషన్ చాలా ఫెంటాస్టిక్ వుంది. ఇది ఆయన కెరీర్ చాలా డిఫరెంట్ మూవీ. సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ అమేజింగ్. వీరి కెమిస్ట్రీ అద్భుతంగా వుంటుంది. టెక్నిషియన్స్ అందరూ వండర్ ఫుల్ గా వర్క్ చేశారు. అందుకే బీజీఎం ఇంత గొప్పగా వచ్చింది. లిరిక్ రైటర్స్ శ్రీమణి జొన్న విత్తుల గారికి, సింగర్స్ కి థాంక్ యూ. ఫెబ్రవరి 7న సినిమా చూసి సూపర్ హిట్ చేయండి’ అన్నారు
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మంచి కథ. ఆ కథని ప్రేక్షకులు దగ్గరికి తీసుకెళ్ళే దర్శకుడు చందు. మంచి టీం. బన్నీ వాసు లాంటి మంచి నిర్మాత. ఆయన వెనుక అరవింద్ గారి సపోర్ట్. సాయి పల్లవి పాజిటివ్ ఎనర్జీ. చైతన్య కథని క్యారెక్టర్ ని పట్టుకొని కష్టపడ్డారు. ఇంతమంది కష్టపడిన తర్వాత సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. జనవరిలో మేము కొట్టాం. ఫెబ్రవరి లో మీరు కొడుతున్నారు. ఆల్ ది బెస్ట్ హోల్ టీం’ అన్నారు.
నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ.. సందీప్ గారికి దిల్ రాజు గారికి థాంక్ యూ సో మచ్. ఇది నా కెరీర్ లో హయ్యస్ట్ బడ్జెట్ సినిమా. దిల్ రాజు గారు సందీప్ గారు లాంటి పాజిటివ్ సక్సెస్ ఫుల్ పీపుల్ ఈవెంట్ కి విష్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మా యూనిట్ అందరికీ థాంక్ యూ. దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇప్పటికీ మూడు సాంగ్స్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరో సాంగ్ రాబోతోంది. డైరెక్టర్ చందు చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. నా ఫస్ట్ సినిమా చైతన్య గారితో స్టార్ట్ చేశాను. నా హయ్యస్ట్ బడ్జెట్ సినిమా ఆయన చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా చైతన్య గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా ఆయనకి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. సినిమా చూసి ఆయన నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. సాయి పల్లవి గారు మెస్మరైజింగ్ యాక్టర్. ఇంత మందికి లైఫ్ ఇచ్చిన అరవింద్ గారికి థాంక్ యూ’ అన్నారు.
ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మాట్లాడుతూ.. అరవింద్ గారు చేసే సినిమాలన్నీ మాకు ఎంతో ఇన్స్ ప్రెషన్ ఇస్తూ వుంటాయి. ఈ సినిమా ఏడాదిగా సౌండ్ చేస్తుంది. ఫెబ్రవరి 7 నుంచి రీసౌండ్ చేస్తుంది. సాయి పల్లవిగారికి పెద్ద ఫ్యాన్. దేవిశ్రీ గారు గత ఏడాది ఓ జాతర చేశారు. దానికి పాన్ ఇండియా షేక్ అయ్యింది. ఇప్పుడు మరో జాతర చేయబోతున్నారు. వాసు చాలా మంచి అభిరుచి వున్న నిర్మాత. తను చేసే సినిమా హిట్ అవ్వాలి. చైతు గారు క్లాస్ మాసు కలిపి చితకొట్టేయబోతున్నారు. ఈ సినిమా చైతు గారి కెరీర్ లో త్రీ డిజిట్. ఈ సినిమా అమలాపురం నుంచి అమెరికా వరకూ రికార్డ్ ఓపెనింగ్స్ తో షేక్ చేయబోతుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్’ అన్నారు.
కో ప్రొడ్యూసర్ భాను ప్రతాప్ మాట్లాడుతూ.. ఈ కథ నా మనసుకి చాలా దగ్గరైయింది. మత్సకారుల సపోర్ట్ ని మర్చిపోలేను. వారి కథనే సినిమాగా తీశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చందు గారు ఈ కథని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు. బన్నీ వాస్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. అల్లు అరవింద్ గారు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. చైతన్య గారితో జర్నీ మర్చిపోలేను. సాయి పల్లవి గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. దేవిశ్రీ ట్రెండింగ్ సాంగ్స్ ఇచ్చారు. సినిమా పెద్ద విజయం సాధించబోతుంది’అన్నారు
కో ప్రొడ్యూసర్ రియాజ్ చౌదరి మాట్లాడుతూ.. గీత ఆర్ట్స్ తో ఇది నా థర్డ్ కొలాబరేషన్. అరవింద్ గారికి థాంక్ యూ. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ నాగ్రేంద్ర మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథ చెప్పినపుడు ఒక మత్సకారుడిలో సైనికుడి కనిపించాడు. ఈ కథతో అందరం కనెక్ట్ అయ్యాం. ఈ సినిమా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నా టీం అందరికీ థాంక్ యూ. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’ అన్నారు.
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలకు థాంక్ యూ. నాగ చైతన్య గారి సినిమాకి పని చేయాలనే కోరిక వుండేది. అది ఈ సినిమాతో తీరింది. సాయి పల్లవి గారు అద్భుతమైన నటి. ఇది బ్యూటీఫుల్ మూవీ. నా విజువల్స్ ని అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది సూపర్ డూపర్ హిట్ మూవీ.
లిరిక్ రైటర్ శ్రీమణి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఇందులో మొత్తం మూడు పాటలు రాశాను. బుజ్జి తల్లి హైలెస్సో పాటలకు చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీప్రసాద్ గారు అన్ని పాటలను చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. డైరెక్టర్ గారు కథలోని ఆత్మని పట్టుకుని లిరిక్స్ రాయించారు. మొట్టమొదట నేను పాటలు రాసిన సినిమా 100% లవ్. నాగచైతన్య గారితో అప్పటినుంచి జర్నీ ఉంది .గీత ఆర్ట్స్ బన్నీ వాసు గారు నా హోం బ్యానర్ గా భావిస్తాను. ప్రతి సినిమాకి పిలిచి పాట రాయిస్తారు. నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థాంక్యూ సో మచ్. టీమ్ అందరికీ శుభాకాంక్షలు. ఫిబ్రవరి 7న థియేటర్స్ లో కలుద్దాం’అన్నారు
లిరిక్ రైటర్ జొన్నవిత్తులు మాట్లాడుతూ.. ఈ సినిమాలో పరమేశ్వరుని మీద ఒక పాట రాశాను. ఈ పాట ఒక పరమాద్భుతం. పదివేల సినిమా పాటల్లో ఇలాంటి పాట ఒకటి ఉంటుంది. వందల సంవత్సరాలు ఉండిపోయే పాట ఇది. ఈ పాటకు పరమాద్భుతంగా సంగీతం సమకూర్చారు దేవిశ్రీప్రసాద్. ఈ సినిమాలో ఒక రెండు సీన్లు చూశాను. నాగచైతన్య ఇంతక ముందుండే సినిమాలకి దీనికి చాలా తేడా ఉంది. చాలా అద్భుతమైనటువంటి నటన కనబరిచారు. చైతన్య మూర్తిభవించినట్లుగా ఉన్నారు. ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అవుతుంది. ఇప్పటివరకు వచ్చిన అద్భుతమైన పది ప్రేమ కథలో ఈ సినిమా కూడా ఉంటుంది. అంత అద్భుతంగా దర్శకుడు చందు ఈ సినిమాని తీర్చిదిద్దారు. దైవభక్తి దేశభక్తి ప్రేమ అన్ని కలగలిసిన సినిమా ఇది. ఇలాంటి అద్భుతమైన సినిమాలలో ఈ పాట రాయడం నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు
యాక్టర్ మహేష్ మాట్లాడుతూ..నాకు ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరో గారికి అందరికీ థాంక్ యూ. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది’ అన్నారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.