అమెరికా, కెనడా, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో అఖండ రికార్డు

నాలుగు దేశాల్లో #అఖండ సెట్ చేయబోతుంది. అమెరికా, కెనడా, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాల్లో 50 రోజులు రన్ పూర్తి చేసుకోబోతున్న తెలుగు సినిమాగా అఖండ రికార్డులకెక్కింది. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత #బాలయ్య సినిమాకి అని కాదు #ఇండియన్ సినిమాకే దక్కిన ఘనత.

ఈరోజుల్లో గట్టిగా 25 రోజులు థియేటర్స్ లో సినిమా ఉంటేనే గొప్ప విషయం అలాంటిది 50 రోజులు విదేశీ గడ్డపై సినిమా ఆడింది అంటేనే అదెంత పెద్ద విజయాన్ని నమోదు చేసుకుందో అర్ధం చేసుకోవాలి. ఇక దీనికే ఇలా ఉంటే గత కొన్ని రోజులు కితమే దర్శకుడు బోయపాటి అఖండ కి #సీక్వెల్ కూడా ఉందని అనౌన్స్ చేసాడు మరి దాని సెన్సేషన్ ఎలా ఉంటుందో చూడాలి.