‘అఖండ 2’ లేటెస్ట్ అప్డేట్

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలలో బిజీ గా ఉన్న నందమూరి బాల కృష్ణ సినిమా షూటింగ్ లకు ఓ చిన్న బ్రేక్ ఇచ్చారు. అయితే బాలయ్య – బోయపాటి కంబినేషన్లో వచ్చిన సినిమాలు సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి రికార్డు సాధించాయి అందరికి తెలిసిన విషయమే. అలాగే వీరిద్దరి కంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా అఖండ. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా స్టోరీ రెడీ అయిపోగా ప్రస్తుతం డైలాగ్ లు పూర్తి చేసే పనిలో ఉన్నారు బోయపాటి.

అఖండ 2 లో ముఖ్యంగా దక్షిణ భారత దేశ దేవస్థానాల ప్రాముఖ్యతను చూపించబూతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా అఖండ 2 లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించనున్నారు. కాగా ఈ ఆక్టోబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవబోతుంది అన్నారు మేకర్స్.