Tollywood: టాలీవుడ్ హీరో నరేశ్ అంటేనే తెలుగు ప్రేక్షకుల్లో కామెడీ చిత్రాల కింగ్ అని గుర్తింపు ఉంది. తన నటనతో ప్రేక్షకులను నవ్వులు పూయిస్తాడు. వీక్షకులను సరదాగా కాసేపు నవ్వించిన అతనికే చెల్లింది.. గత కొన్నేళ్లుగా తెలుగు కామెడీ సినిమాలకు అతనే కేరాఫ్ అడ్రస్‌గా మారాడు నరేశ్. 2002లో రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అల్లరి చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అల్లరి నరేశ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన చిత్రం నాంది.. ఈ Tollywoodసినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాడు. దీంతో వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. నరేశ్ అన్ని చిత్రాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు .. ఈ సినిమాతో తాను నాంది నరేశ్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక అల్లరి నరేశ్‌గా గుర్తింపుతో గత చిత్రం గురించి తెలుసుకుందాం.. గత చిత్రం ఎందుకంటే..
ఆయన నటించిన ఆహనాపెళ్లంటాTollywood చిత్రం నేటితో 10ఏళ్లు పూర్తి చేసుకుంది. 2011లో మార్చి 3న ఆహానాపెళ్లంట చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కామెడీ డ్రామాగా తెరకెక్కి కాసుల వర్షం కురిపించింది.. ఇప్పటికీ కూడా ఈ చిత్రం టీవీలో వస్తే కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. నరేశ్ ఈ సినిమాలో ఓ రేంజ్లో కామెడీతో ప్రేక్షకులకు నవ్వులు పూయించారు. ఇక ఈ చిత్రంతో దివంగత Tollywood ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణ శిష్యుడైన వీరభద్రమ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇందులో రీతూ బర్మేఛా, అనితా హీరోయిన్ల్‌గా చేశారు. అలాగే ఈ సినిమాలో దివంగత ప్రముఖ నటుడు శ్రీహరి, బ్రహ్మనందం పాత్రలు ప్రేక్షకులకు ఎంతో ఫిదా అయ్యారు. ఈ సినిమాలో ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, నాగినీడు, జయప్రకాశ్‌రెడ్డి, పృథ్వీరాజ్, తాగుబోతు రమేశ్, హంస నందిని తదితరులు ఈ Tollywoodచిత్రంలో నటించి ఈ సినిమా విజయంలో భాగం అయ్యారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 48 కేంద్రాల్లో 50 రోజులు.. అలాగే ప్రధాన నగరాల్లో 100 రోజులు పూర్తయింది. 2011లో ఈ చిత్రం ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచే స్వరాలు అందించగా.. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై రామ బ్రహ్మం సుంకర ఈ Tollywoodచిత్రాన్ని నిర్మించాడు.