Aha: నేడు ఆహా వార్షికోత్స‌వం.. ఎమోష‌న‌ల్‌గా అల్లుఅర‌వింద్ లేఖ‌!

Aha: ప్ర‌ముఖ సినీ నిర్మాత అల్లు అర‌వింద్ ఆహా అనే ఓటీటీ ప్లాట్‌ఫాం గ‌తేడాది ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే త్వ‌రలో ఆహా ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్భంగా అల్లు అర‌వింద్ ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ తానే స్వ‌యంగా రాసిన ఓ లేఖ‌ను రిలీజ్ చేశారు. ప్రియ‌మ‌యిన కుటుంబ‌స‌భ్యుల‌కు అని ప్రేక్ష‌కుల‌ను అన్న‌ట్టు అభివ‌ర్ణించాడు. ఆహా అనేది ఓ పెద్ద కుటుంబం అయినందుకు సంతోషంగాను, గ‌ర్వంగాను ఉంద‌ని ఆ లేఖ‌లో తెలిపారు.

aha alluaravind

మీ ప్రేమ ఆద‌ర‌ణ వ‌ల్లే ఈ రోజు Aha ఆహా ఓటీటీ మొద‌టి వార్షికోత్స‌వం చేసుకుంటున్న‌ది ఆయ‌న అన్నారు. అలాగే వినోదం అంటే మ‌న‌కు ఇష్టం- తెలుగు అంటే ఇంకా ఇష్టం అని.. రెండూ క‌లిసిన ఈ ఆహా ను విజ‌య‌వంతంగా న‌డిపిస్తున్న మీకు,Aha Aha ఆహా టీం ఎంత‌యినా కృత‌జ్ఞులం అని అన్నారు. జూప‌ల్లి రామేశ్వ‌రావుగారికి, రాముగారికి అలాగే మాతో నడిచే భాగ‌స్వాములంద‌రికీ, ఇంత వేగంగా దీనిని తీసుకురావ‌డానికి నిర్విరామంగా ప‌నిచేసిన త‌మ సిబ్బంది అంద‌రికి నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌తలు అంటూ Aha ఆ లేఖ‌లో పేర్కొన్నారు అల్లు అర‌వింద్‌.