షర్మిల కొత్త పార్టీ పేరు ఇదే.. తెలుపు రంగులో జెండా

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల కొత్త పార్టీకి రంగం సిద్ధమైంది. ఇవాళ లోటస్‌పాండ్‌లో తెలంగాణకు చెందిన పలువురు వైసీపీ మాజీ నాయకులతో షర్మిల సమావేశం కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. షర్మిల కొత్త పార్టీ ప్రకటిస్తారనే వార్తలతో లోటస్ పాండ్ దగ్గర సందడి వాతావరణం ఏర్పడింది. కార్యకర్తలు, అభిమానులు టపాసులు పేలుస్తూ హంగామా సృష్టించారు.

sharmila new party name

ఈ సందర్భంగా లోటస్ పాండ్ దగ్గర వైఎస్ షర్మిల ప్లెక్సీలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ ఫ్లెక్సీల్లో రాజశేఖర్ రెడ్డి, షర్మిల ఫొటోలు ఉండగా.. జగన్ ఫొటో కనిపించకపోవడం గమనార్హం. త్వరలో తెలంగాణలో 100 నియోజకవర్గాల్లో 16 నెలల పాటు పాదయాత్ర చేయాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అయితే షర్మిల కొత్త పార్టీ పేరు బయటికొచ్చింది. వైఎస్సార్ తెలంగాణ పేరుతో కొత్త పార్టీ స్థాపించనున్నట్లు సమాచారం. ఇక పార్టీ జెండాకి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెల్లటి జెండాపై భగభగ మండే సూర్యుడి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. షర్మిల కొత్త పార్టీ జెండా ఇదేనని చెబుతున్నారు.