మరోసారి రజినీకాంత్ పక్కన చంద్రముఖి నటిస్తోంది…

పద్నాలుగేళ్ల క్రితం 2005లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి చంద్రముఖి. సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసిన చంద్రముఖి జ్యోతికని స్టార్ చేసింది. రజినీకాంత్ లాంటి స్టార్ సినిమాకి చంద్రముఖి అనే టైటిల్ పెట్టారు అంటేనే జ్యోతిక నటించిన క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. మల్టీపర్సనాలిటీ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిగా, క్లాసికల్ డాన్సర్ గా కనిపించిన జ్యోతిక చంద్రముఖి సినిమాకి ప్రాణం పోసింది. చంద్రముఖి మాత్రమే కాకుండా ఠాగూర్, మాస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన జ్యోతిక, 41వ వయసులో అడుగుపెట్టింది.

jyothika rajinikanth

ముంబైలో పుట్టి పెరిగిన జ్యోతిక, తన అక్క నగ్మా సౌత్ లో టాప్ హీరోయిన్ గా కావడంతో నార్త్ నుంచి సౌత్ కు వచ్చింది. 1999 లో వచ్చిన వాలి సినిమాతో తమిళ ప్రేక్షకుల పరిచయం అయిన జ్యోతిక అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల సూర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక, చాలా కాలం పాటు సినిమావైపు రాలేదు. ఆరేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్న జ్యోతిక, ఇప్పుడు సూపర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యింది. రీసెంట్ గా అనౌన్స్ అయిన శివ-రజినీ సినిమాలో చంద్రముఖి కాంబినేషన్ ని రిపేట్ చేస్తూ జ్యోతిక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తోంది. జ్యోతికతో పాటు అసురన్ ఫేమ్ మంజు వారియర్ కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.