కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ గా నటిస్తోందా? ఇది నిజంగా రైస్కె

శైలజ కృష్ణమూర్తి సినిమాతో తెలుగు తెరపై మెరిసిన కేరళ కుట్టి కీర్తి సురేష్. ఆ తర్వాత నేను లోకల్ సినిమాలో నటించిన కీర్తి, సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటిలో అద్భుతాలే సృష్టించింది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్, ఆ మహానటే మళ్లీ పుట్టిందా అనిపించే స్థాయిలో మెప్పించింది. ఈ సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకున్న కీర్తి ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై రూపొందుతున్న మిస్ ఇండియా కాగా మరొకటి పెంగ్విన్. కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా మిస్ ఇండియా సినిమా సాంగ్ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. అచ్చతెలుగు పదాలతో రాసిన ఈ సాంగ్ లో మిస్ ఇండియా మేకింగ్ వీడియో చూపించారు.

గుమ్మడి గుమ్మడి అంటూ సాగిన సాంగ్ ప్లే అవుతూ ఉండగా వచ్చిన మేకింగ్ వీడియోలో కీర్తి సురేష్ తో పాటు రాజేంద్ర ప్రసాద్, నవీన్ చంద్ర, నదియా, శ్రీదివ్య కూడా కనిపించారు. ఫారిన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాటు కీర్తి సురేష్ మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి నగేష్ కుకునూరు తెరకెక్కిస్తున్న సినిమా, ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రెసెంట్ చేస్తున్నాడు. ఇంకా టైటిల్ పెట్టని ఈ మూవీ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా, చాలా ట్రెడిషనల్ గా కనిపించిన కీర్తి, ముక్కుపుడకతో కొత్తగా కనిపించింది. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పాటు కీర్తి నటిస్తున్న మరో మూవీ, పెంగ్విన్. ఈశ్వర్ కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. సిల్లోట్ లో డిజైన్ చేసిన ఈ పోస్టర్ లో కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ విమెన్ గా కనిపించింది. ఈ పోస్టర్ చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు, కీర్తి సురేష్ చాలా ఛాలెంజింగ్ రోల్ లో కనిపిస్తోందని అర్ధమవుతుంది. మొత్తానికి బర్త్ డే రోజున కీర్తి సురేష్, తన సినిమాల ఫస్ట్ లుక్స్ అండ్ సాంగ్ టీజర్ తో మెప్పిస్తూనే ఆశ్చర్యపరిచింది. మరి ఈ సినిమాల్లో మహానటి రేంజులో ఏ మూవీ ఆకట్టుకుంటుందో చూడాలి.