బీచ్ ని చూడాలా లేక బికినీని చూడాలా?

తేజస్వి మాడివాడ… బిగ్ బాస్ షో నుంచి సినిమాల దాక ఆమె చేయని పని లేదు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజస్వి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో యాక్టింగ్ డెబ్యూ ఇచ్చింది. మహేష్ మూవీతో డీసెంట్ డెబ్యూ ఇచ్చిన తేజస్వి, ఆర్జీవీ ఐస్ క్రీం సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. గడిచిన 8 ఏళ్లలో 23 సినిమాలు నటించిన తేజస్వి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎన్ని సినిమాలు చేసినా, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో చేసినా అమ్మడుకి ఆశించినంత గుర్తింపు మాత్రం రాలేదు. ఫేమ్ విషయం పక్కన పెడితే అవకాశాలు కూడా బాగా తగ్గాయి. దీంతో తేజస్వి సోషల్ మీడియాలో సత్తా చూపిస్తూ తనలోని మోడల్ ని బయటకి తీస్తుంది. గడిచిన మూడు రోజుల్లో 7 ఫోటోలు పోస్ట్ చేసింది తేజస్వి. ఒక్కో ఫొటోలో ఒక్కో లుక్ లో కనిపించడం విశేషం. ఒకటి చీరలో ఒకటి మోడరన్ లుక్ లో ఒకటి బీచ్ పక్కన బికినిలో ఇలా తేజస్వి తనలో ఉన్న అన్ని షేడ్స్ చూపిస్తూ ఉంది. ముఖ్యంగా బికినీ ఫోటో అయితే సముద్రాన్ని చూడాలా లేక అమ్మడి సోయగాన్ని చూడాలా అనేలా ఉంది. మరి ఈ ఫొటోషూట్స్ అయినా తేజస్వి కెరీర్ కి ఉపయోగ పడుతుందేమో చూడాలి.