కాజల్ అగర్వాల్ కు సమంత పెళ్లి కానుక

అక్టోబర్ 30న ముంబైలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుతో ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. కాజల్‌కు ఆమె అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన శ్రేయోభిలాషులు నుంచి ప్రతిరోజూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందుతున్నాయి.

అయితే ఈ రోజు, స్టార్ హీరోయిన్ సమంతా కాజల్‌కు కొన్ని సాకి గూడీస్‌ను కలిగి ఉన్న ప్రత్యేక గిఫ్ట్ హంపర్‌ను పంపించి ఆశ్చర్యపరిచింది. సామ్ ఈ నెల ప్రారంభంలో సాకి అనే బట్టల బ్రాండ్‌ను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ మరియు కోలీవుడ్‌లోని పలువురు తారలకు ఆమె బహుమతి హంపర్‌ను పంపుతోంది. ఇక కాజల్ పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా ఆమెకు ఈ ప్రత్యేక బహుమతిని పంపారు. అందుకు కాజల్ సమంతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కాజల్ సమంత ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తరువాత మంచి స్నేహితులుగా మారారు. వీరిద్దరు కలిసి జూనియర్ ఎన్టీఆర్ బృందావనం సినిమాలో హీరోయిన్స్ గా నటించిన విషయం తెలిసిందే.