ప్రియా ప్రకాశ్ వారియర్ 2019లో తెరకెక్కిన ఒరు అడార్ లవ్ తెలుగులో లవర్స్ డే చిత్రంతో సినీ ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాలో ఒక పాట సందర్భంగా మధ్యలో వచ్చే సీన్లో కోట్లాది అభిమానులను సంపాదించుకుంది.. దీంతో ఓవర్‌నైట్ స్టార్ అయింది.. ఆ సన్నివేశం ఏంటీ అనుకున్నారా.. అదేనండీ కన్నుగీటి యువ హృదయాలను కొల్లగొట్టింది ఈ మలయాళ భామ. తన్హా, నీ వానమ్ నాన్ మజ్హై, కాదలాసు తోని పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.
ఇక తెలుగు విషయానికొస్తే.. ప్రియా ప్రకాశ్ నటించిన తాజా తెలుగు చిత్రం నితిన్ హీరోగా తెరకెక్కిన చెక్ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం చేయగా.. ఈ నెల ఫిబ్రవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ప్రియా ప్రకాశ్ మాట్లాడుతూ.. Bunnyస్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ కు కేరళలో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారని.. తాను చిన్నతనం నుంచి బన్నీ సినిమాలే చూసేదాన్ని..Bunny బన్నీ అంటే నాకెంతో అభిమానం. కానీ బన్నీ సినిమాలో అవకాశం వస్తే నేను ఆ ఆఫర్‌ను వదిలేసానని ఇటీవలే వార్తాలు వచ్చాయి. అందులో ఏమాత్రం నిజంలేదు.. బన్నీ అంటేనే ఎంతో ఇష్టం.. ఎంతో అభిమానం .. అలాంటి హీరో Bunnyబన్నీ పక్కన అవకాశం వస్తే ఎలా వదులుకుంటాను అని ప్రియా వారియర్ పేర్కొంది.