సుధీర్ బాబు ఇంట్లో ఘట్టమనేని ఫ్యామిలీ సందడి.. మహేష్ న్యూ లుక్ వైరల్

లాక్ డౌన్ కారణంగా మహేష్ బాబు కుటుంబ సభ్యుల మధ్య కొంత గ్యాప్ పెరిగిందనే చెప్పాలి. మహేష్ తన సిస్టర్స్ కి కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉంటాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చాలా రోజుల తరువాత ఘట్టమనేని కుటుంబ సభ్యులను ఇంటికి పిలిచిన సుధీర్ బాబు ఒక పార్టీ ఇచ్చాడు. ఆయన భార్య ప్రియదర్శిని పుట్టినరోజు కావడంతో ఉదయమే మహేష్ తన భార్య ఉపాసనతో కలిసి బావ సుధీర్ ఇంటికి చేరుకున్నారు.

కేక్ కట్ చేసిన తరువాత మంచి విందు భోజనం కూడా చేశారు. సూపర్ స్టార్ కృష్ణ వెళ్లే వరకు మహేష్ అక్కడే ఉన్నారు. జయదేవ్ గల్లా, ఆది శేషగిరిరావు, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ అందరూ కూడా ఫ్యామిలీ ఫొటోలో ఉన్నారు. ఈ రోజు నా లైఫ్ ప్రియ పుట్టినరోజు అంటూ సుధీర్ బాబు స్పెషల్ గా ట్విట్టర్ లో విష్ చేశారు. ఇక మహేష్ బాబు న్యూ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసమే మహేష్ ఈ విధంగా హెయిర్ స్టైల్ ని సెట్ చేసుకొని స్మార్ట్ గా మారాడు. మహేష్ ఫొటోస్ లోనే ఇలా కనిపిస్తున్నాడు అంటే ఇక వెండితెరపై ఇంకెలా కనిపిస్తాడోనని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.