పుల్వామా దాడిపై సినిమా రెడీ అవుతోంది…

ఇండియా పాకిస్థాన్ పైన చేసిన సర్జికల్ స్ట్రైక్ ఉరి సంఘటనని కథాంశంగా చేసుకోని తెరకెక్కిన సినిమా ఉరి. విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన ఈ సినిమా 2019 బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అన్ని ఇండియన్ లాంగ్వేజస్ లో రిలీజ్ అయిన ఉరి యూనానిమస్ గా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడే జోష్ ని మళ్లీ రిపీట్ చేస్తూ బాలీవుడ్ లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. పుల్వామా అటాక్స్, బాగల్కోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన విధానాన్ని సినిమాగా చూపించడానికి వివేక్ ఒబెరాయ్ రెడీ అవుతున్నారు. అబినందన్ వర్థమాన్ పట్టుపడడం, మింటి అగర్వాల్ తెగువని తెరపై చూపించడానికి కథని సిద్ధం చేస్తున్నారు. ఆగష్టు 15న ఎయిర్ ఫోర్స్ నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్న వివేక్ ఒబెరాయ్ త్వరలో ఈ మూవీకి సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు అనౌన్స్ చేయనున్నాడు. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ 2020లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మరి మొదటిసారి నిర్మాతగా మారిన వివేక్ ఒబెరాయ్, ఉరి మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.