రజినీ దర్బార్ లో ఏం జరుగుతోంది?

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే డైరెక్టర్ ఎవరు? బడ్జట్ ఎంత? ఏ జానర్ లో తెరకెక్కుతుంది? ఇలాంటి క్వేషన్స్ ఏమీ వినిపించవు. రజినీ పేరు చూసి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తారు. అలాంటి రజినీకి మురుగదాస్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ కలిస్తే ఎలా ఉంటుంది… డౌట్ ఎందుకు సంక్రాంతి థియేటర్స్ కి వెళ్లండి దర్బార్ సినిమాల ఉంటుందని మీరే చెప్తారు. రజినీ, మురుగదాస్ కలయికలో వస్తున్న ఫస్ట్ మూవీ దర్బార్. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.

ఇటీవలే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్‌ను ముంబయిలో కంప్లీట్ చేశారు. కొంచెం గ్యాప్ తర్వాత దర్బార్ లేటెస్ట్ షెడ్యూల్ పూణేలో మొదలయ్యింది. ఇక్కడ క్లైమాక్స్‌కు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రజినీకాంత్ పై స్పెషల్ గా షూట్ చేయనున్న పూణే షెడ్యూల్ తో దాదాపుటాకీ పార్ట్ అంతా పూర్తవుతుందట. పూణే షెడ్యూల్‌ పూర్తయితే బాలన్స్ ఉండే పాటలన్నింటినీ ఫారిన్ లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో రజినీ డ్యూయల్ రోల్ ప్లే చేయనున్నారు, అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా ఇంకో రోల్ గురించి డీటెయిల్స్ ని బయటకి రాకుండా చూసుకుంటున్నారు. ఆ పాత్ర ఏంటి? అందులో రజినీకాంత్ ఎలా కనిపించబోతున్నాడు అని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాషా తర్వాత రజినీ సినిమా ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం ఇదే మొదటిసారి.