AcharyaTeaserOnJan29: మెగా అభిమానులకు గడ్‌న్యూస్ చెప్పిన కొరటాల శివ

AcharyaTeaserOnJan29: మెగా అభిమానులకు డైరెక్టర్ కొరటాల శివ గుడ్‌న్యూస్ చెప్పాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న విషయ తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరగ్గా.. చిరుతో పాటు కాజల్ అగర్వాల్, సోనూసూద్ ఈ షూట్‌లో పాల్గొన్నారు. ఈ సినిమా కోసం భారీ టెంపుల్ సెట్‌ను వేశారు. ఇండియాలోనే ఇంత పెద్ద భారీ సెట్ ఏ సినిమాకి వేయలేదు.

acharya teaser release date

తాజాగా ఈ సినిమా అప్డేట్‌ను కొరటాల శివ తన అధికారిక ట్విట్టర్‌లో ఇచ్చాడు. ఆచార్య టీజర్‌ను జనవరి 29న సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. డియర్ చిరు సర్.. ధర్మస్థలి తలుపులు జనవరి 29న సాయంత్రం 4.05 గంటలకు తెరుచుకోనున్నాయి అని కొరటాల ట్వీట్ చేశాడు. దీనికి చిరు స్పందిస్తూ.. ప్రామిస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని కామెంట్ చేశారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా… మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. రాంచరణ్ ఇందులో కీలక పాత్రలలో నటించనున్నాడు.