అన్ సీన్ పిక్ తో పవన్ అభిమానులని ఖుషి చేసిన తమన్…

చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇస్తూ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ప్రస్తుతం టాప్ హీరోలందరి సినిమాలకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న తమన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్న మలయాళ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు. ఇటివలే ఈ సినిమా మేకింగ్ వీడియో బయటకి వచ్చి యుట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతోంది. ఈ మేకింగ్ వీడియోకి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పవన్ అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ అభిమానులు ఈ ఆనందంలో ఉండగా, తమన్ మరో సర్ప్రైస్ ఇచ్చి అందరినీ ఫుల్ ఖుషి చేశాడు. పవన్ కళ్యాణ్, తమన్, త్రివిక్రమ్ ఉన్న ఫోటోని తమన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. విత్ మై డియర్ డైరెక్టర్ త్రివిక్రమ్ అండ్ అవర్ లీడర్ పవన్ కళ్యాణ్ గారు అంటూ తమన్ కోట్ చేశాడు. ఈ అన్ సీన్ పిక్ బయటకి రావడంతో పవన్ అభిమానులంతా తమన్ ని థ్యాంక్ చేస్తున్నారు. ఈ పిక్ లో పవన్ కళ్యాణ్ పంచలో ఉండడం విశేషం. మొన్న మొదలైన షూటింగ్ స్పాట్ లో తమన్ ఈ పిక్ దిగినట్లు ఉన్నాడు. ఇది మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ పోలిస్ యునిఫార్మ్ లో ఉన్న మరో పిక్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అన్ అఫీషియల్ గా బయటకి వచ్చిన ఈ పిక్ లో పవన్ భీమ్ లా నాయక్ గా కనిపించాడు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ మలయాళ రీమేక్ 2022 సంక్రాతికి ప్రేక్షకుల ముందుకి రానుంది.