Abhshekbachan: ఆ లెజండ‌రీ న‌టుడిని చూడ‌గానే నా గ‌ర్వం మాయ‌మైంది: అభిషేక్‌బ‌చ్చ‌న్‌

Abhshekbachan: బాలీవుడ్ లెజండ‌రీ మెగాస్టార్ బిగ్‌బి అమితాబ్‌బ‌చ్చ‌న్ వార‌సుడిగా అభిషేక్‌బ‌చ్చ‌న్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. కాగా అమితాబ్ స్థాయిలో మాత్రం పేరు తెచ్చుకోకున్న బాలీవుడ్‌ ప్రేక్ష‌కుల్లో గుర్తింపు సంపాదించుకున్నాడు అభిషేక్‌బ‌చ్చ‌న్‌. అభిషేక్ తాజా చిత్రం బిగ్ బుల్ అనే సినిమా ప్ర‌మోష‌న్స్ భాగంగా ఆయ‌న‌తో పాటు బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ అజ‌య్‌దేవ్‌గ‌ణ్ క‌లిసి కపిల్‌శ‌ర్మ షోకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అభిషేక్ ధూమ్ చిత్రం విజ‌యంపై ఆస‌క్తిక‌ర విష‌యం వెల్ల‌డించారు.

kapilsharma

ఆయ‌న మాట్లాడుతూ.. అమితాబ్‌బ‌చ్చ‌న్ వార‌సుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలుత ప‌లు చిత్రాలు చేసిన అంత‌గా పేరు తెచ్చిపెట్ట‌లేదు. Abhshekbachan కానీ ధూమ్ చిత్రం విజ‌యంతో నాకు స్టార్‌డమ్ ను తెచ్చిపెట్టింది. ఈ సినిమా నాకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింద‌ని, దీంతో ఆటోగ్రాఫ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు తీసుకునేవారు. అప్పుడు నేను గాల్లోనే తేలిపోయా, ఆ చిత్ర విజ‌యోత్స‌వ సంబ‌రాల‌ను త‌న నివాసం ద‌గ్గ‌ర ఒక హోట‌ల్‌లో జ‌రిపారు. Abhshekbachan తిరిగి ఇంటికి వెళ్తున్న క్ర‌మంలో నేను ఎంతో గ‌ర్వంగా ఫీల‌య్యాను. పెద్ద స్టార్ అన్న భావ‌న క‌లిగింద‌ని అన్నారు. ఇక ఇంటికి వెళ్ల‌గానే డోర్ బెల్ కొట్ట‌గానే మా తండ్రి (అమితాబ్‌బ‌చ్చ‌న్‌) త‌లుపు తెరిచారు. ఆయ‌న చూడ‌గానే ఒక్క‌సారే నా గ‌ర్వం అంతా మాయ‌మైపోయింది. నా తండ్రి సాధించిన దానిలో నేను ఆయ‌న కాలీ గోరంతా కూడా సాధించ‌లేద‌ని అర్థం అయింది. నేను ఇంకా ఎంతో క‌ష్ట‌ప‌డాల్సి ఉంద‌ని అప్పుడు అర్థ‌మ‌యింద‌ని అంటూ అభిషేక్ చెప్పారు.