ప్రముఖ బాలీవుడ్ నటి అనుమానాస్పద మృతి

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు నటులను కరోనా బలి తీసుకుంది. కొద్దిరోజుల క్రితం తమిళ నటి చిత్ర సూసైడ్ చేసుకోగా.. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటి అర్య బెనర్జీ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. కోల్‌కత్తాలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించింది. పనిమనిషి వచ్చి తలుపులు కొట్టగా చాలాసేపటికి స్పందన రాలేదు. దీంతో పనిమనిషి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు వచ్చి తలుపులు పగలకొట్టి చూడగా బెడ్‌పై ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది.

ఆమె ముఖంపై గాయాలు ఉండటంతో ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆమె వయస్సు 33 సంవత్సరాలు. ‘ది డర్టి పిశ్చర్’ సినిమాలో విద్యాబాలన్‌తో కలిసి నటించింది. అందులో షకీలా పాత్రను ఆమె పోషించారు. కొంతకాలంగా ఆమె ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటుందని పనిమనిషి చెబుతోంది.

కాగా ఆర్య బెనర్జీ మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటిస్తున్నారు.