యోధుడు సుహెల్దేవ్ పాత్రలో అక్షయ్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన రోబో 2.0లో కాకి మ్యాన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇండియాలో అత్యంత బిజీగా ఉండే నటులలో అక్షయ్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా మరో సినిమాకు అక్షయ్ కుమార్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. సుహెల్దేవ్ రాజుపై అమిష్ త్రిపాఠి రాసిన పుస్తకం ఆధారంగా ఒక సినిమాను తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో సుహెల్దేవ్ రాజు పాత్రలో అక్షయ్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

akshay kumar

అక్షయ్ కుమార్ సన్నిహితుడు అశ్విన్ ఈ పుస్తకం హక్కులను తీసుకున్నాడు. అశ్విన్, అక్షయ్ కుమార్‌ మంచి ఫ్రెండ్స్. ఇటీవల వీరిద్దరు భేటీ అయి ఈ సినిమాపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాజు సుహెల్దేవ్ పాత్రలో నటించాలని అక్షయ్‌కుమార్‌ను అశ్విన్ కోరాడట. అయితే అక్షయ్‌కి కూడా ఈ కథ బాగా నచ్చడంతో ఇందులో నటించేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.

మరోవైపు అక్షయ్ కుమార్ దర్శకుడు జగన్ శక్తితో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. 2021 చివరి నాటికి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుండగా.. 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన వర్క్ జరుగుతోంది. ఈ సినిమా పూర్తైన తర్వాత కొత్త సినిమాను అక్షయ్ ప్రకటించనున్నాడు. ౌ