చిన్న లోపం ఉన్నా హేళన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ సంకల్పం ఉంటే మనిషి విజయానికి ఏ లోపం అడ్డు రాదు అని ఎంతో మంది నీరూపించారు. పొట్టి వాడు గట్టివాడు అనే పదానికి అసలైన అర్థం చెప్పిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఎత్తును చూసి హేళన చేసిన వారిని నోరు మూయించేలా ఆయన ఒక దేశాన్ని నడిపాడు. జై జవాన్ జై కిసాన్ అనే నినాధానికి ప్రాణం పోసి, పాకిస్థాన్ వంటి దేశంతో యుద్ధ జరుగుతున్న సమయంలో ఉద్యమాలు చేసిన వ్యక్తి ఆయన.
అయితే ఇప్పుడు అదే తరహాలో మనిషిలో స్ఫూర్తిని నింపారు ఒక ఉత్తరాఖండ్ మహిళ. ఆమె పేరు ఆర్తి డోగ్రా. ఆర్తి అంటే ఇప్పుడు ఒక పేరు కాదు. ఎందరికో ఒక స్ఫూర్తి. ఆమె సాధించిన విజయం ఎంతటి బాధలో ఉన్నవారికైనా ఒక ప్రేరణగా నిలుస్తుంది. డెహ్రాడూన్ ఆర్తి స్వస్థలం. ఎత్తు మూడు అడుగుల రెండు అంగుళాలు. ఆమె ఇప్పుడు ఒక ఐఎస్ అధికారి. ఢిల్లీ శ్రీరామ్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె ఎంతో కష్టపడి ఐఎస్ చదువుకుంది. ప్రస్తుతం రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఆమె కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనుకున్నది సాదించడానికి భారదేశంలో ఎవరికైనా సాధ్యమేనని ఆర్తి నిరూపించింది.