చదలవాడ శ్రీనివాసరావు అండతో చివరి సహాయం అందుకున్న రావి కొండలరావు

600కు పైగా సినిమాలలో నటించి తెలుగు చిత్రపరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న నటుడు రావి కొండలరావు(88). విజయ వాహిని ప్రొడక్షన్ లో భైరవ ద్వీపం వంటి సినిమాలకు ఎక్జుక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వర్క్ చేశారు. అయితే ఇటీవల ఆయన గుండెపోటుతో మరణించడం అందరిని షాక్ కి గురి చేసింది. 50ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఆయన చివరి సమయంలో కొంత ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్నారు.

అయితే కొండలరావు పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రముఖ నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు మే 14న ఆయనకు ఆర్థిక సహాయం అందించారు. కేవలం ఒక గురు దక్షిణగా భావించి రావు కొండలరావు గారికి ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమక్షంలో 50వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ సహాయానికి కొండలరావు ఆ నాడు భావోద్వేగానికి గురయ్యారు. శ్రీనివాసరావు చేసిన సహాయం మరువలేనిదని కొనియాడారు. ఇక కొండలరావు మృతిపట్ల చదలవాడ శ్రీనివాసరావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.